అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 14
తెలంగాణలో ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి గడువును భారత ఎన్నికల సంఘం (ECI) జూలై 24 వరకు పొడిగించింది. అయితే, ఇంకా దరఖాస్తు చేసుకోలేని వారి కోసం గడువును ఆగస్టు 30 వరకు పెంచాలని మాదిగల అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిగులపు లింగన్న ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి గడువును భారత ఎన్నికల సంఘం (ECI) జూలై 24 వరకు పొడిగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) చేసిన అభ్యర్థన మేరకు ఈ సవరించిన షెడ్యూల్ను విడుదల చేసింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం, జూలై 24 వరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. అయితే, ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంకా కొంతమంది వివిధ కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారని మాదిగల అంబేద్కర్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నిగులపు లింగన్న తెలిపారు.
ఈ నేపథ్యంలో, దరఖాస్తుల గడువును ఆగస్టు 30 వరకు పొడిగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.











