Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 17
గోదావరి నదిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళను హాజీపూర్ పోలీసులు సకాలంలో అడ్డుకుని, ఆమె ప్రాణాలను కాపాడారు. స్థానికుల సమాచారంతో స్పందించిన పోలీసులు, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు.
గోదావరి నదిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రాణాలను హాజీపూర్ పోలీసులు కాపాడారు. శుక్రవారం మందమర్రి మండలానికి చెందిన ఓ మహిళ నది వైపు వెళ్తుండగా, అనుమానం వచ్చిన స్థానికులు ఎస్సై కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. ఆమె వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.









