Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 18
హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో శుక్రవారం సహజ వ్యవసాయం, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజామృతం, జీవామృతం తయారీతో పాటు బహుళ పంటల సాగుపై రైతులకు వివరించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని సూచనలు అందాయి.
హాజీపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో శుక్రవారం సహజ వ్యవసాయం, జాతీయ సహజ వ్యవసాయ మిషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజామృతం, జీవామృతం తయారీతో పాటు బహుళ పంటల సాగుపై రైతులకు వివరించారు.
వర్షాభావ పరిస్థితుల్లో వరికి బదులుగా పప్పు దినుసులు, కూరగాయలు, జొన్న వంటి ఆరుతడి పంటలు వేయాలని ఏవో కృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో కృషి సఖి స్వప్న, రైతులు పాల్గొన్నారు.











