మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన ఏకారి లిఖిత, ఇటీవల జరిగిన జూనియర్ సివిల్ జడ్జిల నియామక పరీక్షల్లో విజయం సాధించి, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆమె నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల ప్రకటించిన జూనియర్ సివిల్ జడ్జిల నియామక ఫలితాల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ (అరుణక్కనగర్) కు చెందిన ఏకారి లిఖిత, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ వార్త ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా సంతోషాన్ని నింపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ శుభ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, నస్పూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి లిఖితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సత్కరించి, భవిష్యత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.











