మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 20
రేపు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట గ్రామంలో రైతులను పరామర్శించడానికి వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR పర్యటన నేపథ్యంలో, సమావేశ ఏర్పాట్లను BRS నాయకులు పరిశీలించారు. Dr.బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావ్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
రేపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్షెట్టిపేట గ్రామంలో రైతులను పరామర్శించేందుకు విచ్చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారి సమావేశ కార్యక్రమాల ఏర్పాట్లను చెన్నూర్ మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు, BRS పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు Dr.బాల్క సుమన్ గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావ్ గారు, BRS నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు.












