మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 13
ూ,ణ,ూఘఆఎణష.షౌఇఈోషఎొ.ూ.
మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చూడాలంటే, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సైన్యంతోతో వారం రోజులు ప్రయాణిస్తే ప్రతి అభివృద్ధి పనిని డైరీలో రాసుకోవచ్చని, ఆయన అభివృద్ధిని చేసి చూపిన ఘనత దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తో పాటు ఇతర నేతలకు ఈ సూచనలు చేశారు.
బీజేపీపై విమర్శలు
ప్రజల పక్షపాతి, రైతు నేత దివాకర్ రావుపై కమలం పార్టీ (బీజేపీ) నామమాత్రంగా వ్యవహరిస్తూ, యువనేత విజిత్ రావుపై చేసిన వ్యాఖ్యలు శోచనీయమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. మంచిర్యాలలో అభివృద్ధికి దివాకర్ రావు కేరాఫ్ అడ్రస్ అని, గత 12 ఏళ్ల పాలనలో బీజేపీ మంచిర్యాలకు చేసిందేమీ లేదని వారు విమర్శించారు.
అమెరికాలో బిజెపి నేత రఘునాథరావు ఉన్నా ప్రజల్లోనే
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజల్లోనే ఉంటున్నారని, ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తించాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం అన్నారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు అంకం నరేష్ ఎర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.










