Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 02
మంచిర్యాల జిల్లాలోని నీటి ప్రాజెక్టులలో జులై 1వ తేదీ నుంచి చేపల వేటను నిషేధిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి అవినాష్ తెలిపారు. ఎల్లంపల్లి బ్యారేజీ, రాళ్లవాగు, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులలో మత్స్యకారులు ఆగస్టు 31 వరకు చేపల వేట చేపట్టరాదని ఆయన పేర్కొన్నారు.

జులై, ఆగస్టు మాసాల్లో చేపల ప్రత్యుత్పత్తి జరుగుతున్నందున, ఎవరైనా చేపలను వేటాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.