మంచిర్యాల (అక్షరవేకువ) జూన్ 30
కకకకణగఇకకటక110 టన్నుల చెత్త పోగు 60 మంది కార్పొరేటర్లు బాధ్యత తీసుకోవాలి డంపింగ్ యార్డ్ లో వేరులేని కారణంగా ఇక్కట్ల వెల్లువ మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ట పోగు 60దకటీకగ110టక,కగకకఇకకటఏ,ఈకకీకకక.టశ.60దకటశదఆక.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో రోజుకు 110 టన్నుల తడి, పొడి చెత్తను వేరు చేయకుండా డంపింగ్ యార్డులకు తరలించడం వల్ల అనేక ఇక్కట్లు ఏర్పడుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి పౌర సమాజం బాధ్యత తీసుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ జి. అన్వేష్ స్పష్టం చేశారు.
60 మంది కార్పొరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. తడి చెత్తను ఎరువులకు, పొడి చెత్తను ఆదాయానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని, ఈ దిశగా చర్యలు చేపడితేనే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని తెలిపారు.
ప్రతి గృహం నుంచి చెత్తను వేరువేరుగా సేకరించేలా కార్పొరేటర్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ అన్వేష్ సూచించారు. అవగాహనతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు.












