మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 10
మా గళం బలం పిఎస్ఆర్ అని మంచిర్యాల మేయర్ మధుకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు తూముల నరేష్ నేతృత్వంలో 53 మంది కార్పొరేటర్లతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతా ఒకే తాటిపై ఐక్యతతో ఎమ్మెల్యే దంపతులు సురేఖ ప్రేమ్‌సాగర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తెలిపారు.
సోమవారం ఎమ్మెల్యే నివాసంలో మీడియాతోమా గళం బలం పిఎస్ఆర్ అని మంచిర్యాల మేయర్ మధుకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సిటీ అధ్యక్షులు తూముల నరేష్ నేతృత్వంలో 53 మంది కార్పొరేటర్లతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
కార్పొరేటర్ల ఐక్యత
కాంగ్రెస్ కార్పొరేటర్లు అంతా ఒకే తాటిపై ఐక్యతతో ఎమ్మెల్యే దంపతులు సురేఖ ప్రేమ్‌సాగర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తున్నామని, ఎలాంటి అపోహలు, అసత్యాలు, ఆరోపణలకు తావులేదని స్పష్టం చేశారు. తమ ఊపిరి ఉన్నంతవరకు పిఎస్ఆర్ తోనే ముందుకు సాగుతామని, కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు లేవని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కార్పొరేటర్లు రాంరెడ్డి, స్రవంతి కిషోర్, సదానందం ఖండించారు.
మేయర్ మధుకర్ భరోసా
మేయర్ మధుకర్ మాట్లాడుతూ, తమకు రాజకీయ ఓనమాలు నేర్పిన ఎమ్మెల్యే దంపతులతోనే తమ తుది శ్వాస వరకు ప్రయాణం ఉంటుందని, లేనిపోని వ్యక్తులకు ఆస్కారం ఉండదని, అసత్యాలను ప్రజలు నమ్మవద్దని వెల్లడించారు.
రాజకీయ భవిష్యత్ ప్రణాళిక
రాజకీయంగా ఎమ్మెల్యేను బలపరుస్తూనే, వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని, ఆ తదుపరి నగర కార్పొరేషన్ సైతం కాంగ్రెస్ సొంతమేనని వెల్లడించారు. తమ పదవులు తిరిగి చేపట్టే విధంగా కార్యాచరణతో పాటు హస్తం పార్టీని బలపర్చి, మరోమారు మంచిర్యాల అసెంబ్లీలో మూడు రంగుల జెండా ఎగిరే విధంగా పథకం రూపొందించుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు అభివృద్ధి పథకాలు అందిస్తూ అభిమానాన్ని చురగొంటూ, వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పాలనే సాగేవిధంగా ముందుకు సాగుతామని మేయర్ మధుకర్ తెలిపారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలోని 53 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు.










