మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 12
గత 20 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాలన వైఫల్యం చెందటం వల్లే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు విజిత్ రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టుపై విమర్శలు
ఎల్లంపల్లి ప్రాజెక్టును తానే కట్టించానని గొప్పలు చెప్పుకుంటున్న దివాకర్ రావు, ప్రాజెక్ట్ సాధన కోసం ఆయన చేసిన పోరాటం ఏమిటని వెంకటేశ్వర్ గౌడ్ ప్రశ్నించారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కనీసం ఒక్క ధర్నా లేదా వినతి పత్రం అయినా సమర్పించారా అని నిలదీశారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నందుకే దివాకర్ రావుకు ఎల్లంపల్లి దివాకర్ రావు అనే పేరు వచ్చిందని, ముంపు బాధితులకు ఆయన చేసింది శూన్యమని విమర్శించారు. ముంపు బాధితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీ హయాంలోనే పెండింగ్ లో ఉన్న పరిహారాన్ని ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.
రైతుల పక్షాన రఘునాథ్ పోరాటం
ఎల్లంపల్లి బాధితులకు పెండింగ్ లో ఉన్న పరిహారం చెల్లించాలని రఘునాథ్, బీజేపీ నాయకులు నిరసనలు, ఆందోళనలు చేస్తే, మీ బీఆర్ఎస్ హయాంలో రఘునాథ్ పై రెండు అక్రమ కేసులు నమోదు చేసిన నీచమైన చరిత్ర మీదని వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. రైతుల కోసం రఘునాథ్ ఏం చేశారని ప్రశ్నించిన విజిత్ రావుకు, మీ బీఆర్ఎస్ హయాంలో వడ్ల ప్రతి బస్తాకు 3 నుంచి 5 కిలోల కటింగ్ పెట్టి రైస్ మిల్లర్ల వద్ద కమిషన్ తీసుకుని రైతులను దోచుకున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వైఖరిని గుర్తు చేశారు. దండేపల్లి నుంచి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి రైతుల పక్షాన పోరాడిన నాయకుడు రఘునాథ్ అని తెలిపారు.
గూడెం లిఫ్ట్ పైపుల మార్పుపై ఒత్తిడి
గూడెం లిఫ్ట్ పైపులు తరచుగా పగిలిపోతుంటే, వాటిని మార్చాలని ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది మా రఘునాథ్ అని వెంకటేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల తర్వాత, ఇప్పుడు విజిత్ రావు బయటకు వచ్చి తాము రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అసలు ఈరోజు రైతుల పరిస్థితి ఇలా ఉండటానికి కారణం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వైఫల్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు