జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో, 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు 265 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అలాగే, బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలలో కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఎన్నికల విధులు కేటాయించబడిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
పోలింగ్ రోజున ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.











