సంగారెడ్డి, 2026-08-11
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో నిర్వహించిన ర్యాలీ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ, దేశభక్తి నినాదాలతో వారు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాను గుండెల్లో నిలుపుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారు అందించిన స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని అన్నారు.
దేశం సాధించిన ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఐక్యంగా కృషి చేయాలని వారు సూచించారు. జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, బీజేపీ సంగారెడ్డి జిల్లా నాయకులు రాజేశ్వర్ దేశ్పాండే, రాజశేఖర్ రెడ్డి, వెంకట నర్సింహారెడ్డి, కులకర్ణి, ఆనంద్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.