ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆరుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని పిల్లల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆరుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు శిశువులు మరణించిన విషయం తెలిసిందే. ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు సారథ్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. సభ్యులు వార్డును పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోనున్నారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. రిమ్స్ ఆసుపత్రిలోని శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.











