జగిత్యాల, 2026-08-27
కపాస్ క్రాంతి పథకం ()లో భాగంగా అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల శాస్త్రవేత్తల బృందం హాజిపూర్ మండలంలోని సబ్బేపల్లి గ్రామంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శన ద్వారా ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయంపై రైతులకు అవగాహన కల్పించారు.
కపాస్ క్రాంతి పథకం ()లో భాగంగా అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల శాస్త్రవేత్తల బృందం సబ్బేపల్లి గ్రామం, హాజిపూర్ మండలంలో క్షేత్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ క్షేత్ర ప్రదర్శన ద్వారా, అధిక సాంద్రత పత్తి సాగులో శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించేందుకు రైతులకు అవగాహన కల్పించారు.
పంటల నివారణ సూచనలు
ఈ సందర్భంగా, శాస్త్రవేత్తలు వివిధ పంటలలో పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. పత్తిలో రసంపీల్చు పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 60/ఎకరా, ఆసియామీప్రైడ్ 50 గ్రాములు/ఎకరా వాడాలని సూచించారు. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు క్లోరాంట్రానిప్రోనిల్ గుళికలు, జొన్న పంటలో పండు ఈగ నివారణకు డైమెథోయేట్ 30 250గ్రాములు/ఎకరాకు వాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. ఎన్.సాయినాథ్, డా. కె. రాజేష్, డా. పి. రవి, డా. కె. రామకృష్ణ; రైతులు తిప్పని కుమార్ స్వామి, రాజేష్, ప్యాట వినోద్; వ్యవసాయ అధికారి క్రిష్ణ; ఏఈఓ కొమురయ్య పాల్గొన్నారు.












