మండల జైపూర్ కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో భీమారం మండలానికి చెందిన 14 మందికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. భీమారం గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులకు ఈ చెక్కులను అందించారు.
ఈరోజు జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో, రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో భీమారం మండలానికి సంబంధించిన 14 మందికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. భీమారం గ్రామపంచాయతీకి సంబంధించి ఉల్లి రవళి, దివ్య, ధార వేణి, కమల, కొత్త విజయ, పోడేటి చరిష్మా, భూక్య విజయ అనే అర్హులకు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో భీమారం ఎమ్మార్వో సదానందం, భీమారం సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి, జిపిఓ పున్నం చంద్, ఓంకార్ పాల్గొని 14 మందికి చెక్కులను అందజేశారు.

