మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్ లోని హరి నిలయ విల్లాస్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 100 మందికి పైగా మహిళలు పాల్గొని, ఆటపాటలతో గౌరమ్మను పూజించి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్ లోని గేటెడ్ కమ్యూనిటీ హరి నిలయ విల్లాస్ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో మంచిర్యాల పట్టణ, పరిసర ప్రాంతాల నుండి 100 మందికి పైగా మహిళలు పాల్గొని, ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.
హరి నిలయ విల్లాస్ యాజమాన్యం శ్రీమతి శ్యామలాదేవి, సూరజ్ రావు, మధుసూదన్ రెడ్డి, రజనీ రెడ్డి అతిథులను ఆహ్వానించి, వారికి సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. మలబార్ గోల్డ్ వారు అందించిన బహుమతులను అందజేసి, అందరికీ అల్పాహారాన్ని కూడా సమకూర్చారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు, ముఖ్యంగా మహిళామణులకు పవిత్రమైన, ప్రీతిపాత్రమైన బతుకమ్మ సంబరాలను ఈ ప్రాంగణంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. హరి నిలయ విల్లాస్ ఆధ్వర్యంలో తరచూ ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న గౌరవ మహిళామణులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేశారు.












