మందమర్రి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికల్లో జి. చందర్ అధ్యక్షుడిగా, ఎండి సలాముద్దీన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఈ ఎన్నికల్లో జి. చందర్ 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో జి. చందర్, తేళ్ల విజయ్ కుమార్, ఎండి అక్బర్ పోటీ పడ్డారు. మొత్తం 38 ఓట్లు పోలవ్వగా, జి. చందర్ 23 ఓట్లు సాధించి గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి తేళ్ల విజయ్ కుమార్ 13 ఓట్లు పొందారు.
ప్రధాన కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో ఎండి సలాముద్దీన్, కోశాధికారి పదవికి సకినాల శంకర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను అడ్హాక్ కమిటీ పర్యవేక్షించింది.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అడ్హాక్ కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు నియామక పత్రాలు అందజేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జి. చందర్ మాట్లాడుతూ, క్లబ్ సభ్యుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు అందేలా చూస్తామని తెలిపారు.
ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










