మంచిర్యాల టౌన్ (అక్షరవేకువ) జూలై 31
అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ నీపుత్రపుత్ర రియల్ ఎస్టీపుత్రట్ సంస్థ యజమాని గుర్రాల శ్రీపుత్రధర్ను బెదిరించి రూ.3 లక్షలు డిమాండ్ చీపుత్రసిన కీపుత్రసులో 'తెలుగు ప్రభ' రిపోర్టర్ అనీపుత్రష్, 'అగ్నిధార' ఎడిటర్ రవికుమార్ యాదవ్, గొర్డపెల్లి సురీపుత్రష్పై మంచిర్యాల పోలీపుత్రసులు కీపుత్రసు నమోదు చీపుత్రశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మీపుత్రరకు దర్యాప్తు ప్రారంభించారు.
పేరుకు విలేకరులు.. కానీ పని మాత్రం బ్లాక్మెయిల్. తప్పుడు కథనాలు రాస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టులు, ఒక అనుచరుడిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గుర్రాల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
గత కొంతకాలంగా 'తెలుగు ప్రభ' రిపోర్టర్ అనీష్, గొర్డపెల్లి సురేష్ కలిసి సంస్థపై సోషల్ మీడియాలో ఆధారాలు లేని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జనవరి 29న 100 ఫీట్ రోడ్డులోని ఆఫీసుకు వచ్చిన అనీష్, "వార్తలు రాయకుండా ఉండాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలి. లేకుంటే రోజూ ఇలాగే పోస్టులు పెడతాం" అని బెదిరించాడు.
వేధింపులు తట్టుకోలేక ఆ రోజు రాత్రి 9:15 గంటలకు రూ.50,000 నగదు ఇచ్చినట్టు బాధితుడు తెలిపాడు. మిగిలిన డబ్బుల కోసం సురేష్ రోజూ వాట్సాప్ మెసేజ్‌లు చేస్తూ వేధిస్తున్నాడు.
ఇదిలా ఉండగా 'అగ్నిధార' ఎడిటర్ రవికుమార్ యాదవ్ కూడా ఈ ముఠాతో చేరి సంస్థపై తప్పుడు కథనాలు రాస్తూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"గతంలో మా దగ్గర డబ్బులు తీసుకుని కొందరు RTIలు, కంప్లైంట్లు పెడుతూ సంస్థను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ను ఉపేక్షించం. చట్టపరంగా చర్యలు తప్పవు" అని అంజనీపుత్ర యాజమాన్యం హెచ్చరించింది.
నిందితులు పంపిన వాట్సాప్ చాట్లు, బెదిరింపు కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా స్క్రీన్షాట్లు ఆధారంగా పోలీసులు అనీష్, సురేష్, రవికుమార్ యాదవ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












