మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 25
మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములపల్లి గ్రామంలో పేకాట స్థావరంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ బృందం శనివారం సాయంత్రం దాడి చేసింది. ఈ దాడిలో నగదు పందెం కాస్తూ మూడుముక్కల పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.02 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ బృందం శనివారం సాయంత్రం విశ్వసనీయ సమాచారం మేరకు మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేపట్టింది. ఈ దాడిలో నగదును పందెంగా పెట్టి మూడుముక్కల పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.1,02,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.












