మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వయంగా పరిశీలించారు. ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ విశ్వనాథ ఆలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
మంచిర్యాల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఈ ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దర్ని మధుకర్, ఈఓ ముక్త రవి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












