ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, పౌష్టికాహారం, సురక్షితమైన తాగునీరు, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ అంశాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, పౌష్టికాహారం, సురక్షితమైన తాగునీరు, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు, మరమ్మతుల అవసరాలు, విద్యార్థుల భద్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్‌తో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, ఆహారం తయారీ, నిల్వ, పంపిణీలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అవసరమయ్యే పనులకు సంబంధించి పూర్తి వివరాలతో అంచనా ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని ప్రిన్సిపాల్స్, జిల్లా కోఆర్డినేటర్లను ఆదేశించారు. విద్యార్థులు రాత్రి వేళల్లో కూడా సురక్షితంగా సంచరించేలా రెసిడెన్షియల్ పాఠశాలల క్యాంపస్ పరిసరాల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకునేలా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












