ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏల్లో రెండు డీఏలను విడుదల చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై జిల్లా అధ్యక్షుడు ఎం.డి.జావీద్ అలీ, ప్రధాన కార్యదర్శి వేల్పూరి రవి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏల్లో రెండు డీఏలను విడుదల చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధ్యక్షుడు ఎం.డి.జావీద్ అలీ, ప్రధాన కార్యదర్శి వేల్పూరి రవి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వారు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు రెండు డీఏలను ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేనీ ముజీబ్ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే డీఏల విడుదలకు మార్గం సుగమమైందని పేర్కొంటూ, వారికి జిల్లా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
మిగిలిన ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ముఖ్యంగా పీఆర్సీ నివేదికను తెప్పించి, 51 శాతం ఫిట్మెంట్తో నూతన పే స్కేళ్లను అమలు చేయాలని, మిగిలిన పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.












