సంగారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలోని శిక్షణా విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు.
సంగారెడ్డి పట్టణంలో వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కళాశాలలోని ఒకేషనల్ ట్రైనింగ్ విభాగాలను పరిశీలించి, కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, ఐటీఐలను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. నర్సింగ్ విద్యార్థులకు వివిధ దేశాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వారికి జర్మనీ, జపనీస్ భాషలలో ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం, భాషా ప్రావీణ్యం పెంచుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో ఈ వొకేషనల్ కళాశాలను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. కళాశాల చైర్మన్ సూర్య కిరణ్, ప్రిన్సిపల్ లక్ష్మణ్ లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.












