బైంసా (అక్షరవేకువ) జూలై 04
బైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 36 ఏళ్లుగా అధ్యాపకుడిగా పనిచేసిన భూషణ్ పాండే గారి సేవలను వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ కొనియాడారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా బైంసాలోని వశిష్ట జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.
బైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులుగా 36 ఏళ్లుగా పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దిన భూషణ్ పాండే గారి సేవలు అమూల్యమని, ఆయన సేవలను వశిష్ట కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ కొనియాడారు.
బైంసా పట్టణంలోని వశిష్ట జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం భూషణ్ పాండే గారిని అత్యంత ఘనంగా సన్మానించారు. ఆయన పదవి విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన సభలో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ భూషణ్ పాండే సత్ప్రవర్తన కలిగి, క్రమశిక్షణతో బోధన అందించారని అన్నారు.
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా కృషిచేసిన పాండే గారి సేవలు విస్మరించలేమని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసినప్పటికీ వశిష్ట కళాశాలకు సహాయ సహకారాలు అందించారని, అతనితో విడదీయరాని అనుబంధం తనకు, కళాశాలకు ఉందని గుర్తు చేశారు.
పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎల్. నారాయణ రెడ్డి, న్యాయవాది బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి పాండే, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్, నాయకులు గాలి రవి, ప్రభాకర్, సాయినాథ్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.


