హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, దండేపల్లి గ్రామంలో నూతన ఫ్రీ ప్రైమరీ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ గొల్లపల్లి సంపత్, విద్యాశాఖ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కేంద్రం చిన్నారుల ప్రాథమిక విద్యకు దోహదపడనుంది.
దండేపల్లిలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ ప్రైమరీ కేంద్రాన్ని సర్పంచ్ సంపత్, ప్రధానోపాధ్యాయురాలు అరవింద, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎల్. మనోహర్ నాయక్, మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ కలిసి ప్రారంభించారు.
ప్రారంభోత్సవం అనంతరం, కేంద్రంలో చేరిన చిన్నారులకు సామూహిక అక్షర అభ్యాసం నేర్పించారు. ఇది పిల్లలకు అక్షర జ్ఞానాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఏల్ మనోహర్ నాయక్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నూతన విద్యా కేంద్రం ఏర్పాటుపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇది గ్రామంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












