రాజీవ్‌నగర్, మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) సెప్టెంబర్ 03
మంచిర్యాల: రాజీవ్‌నగర్‌లోని తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాల, మంచిర్యాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు మంచిర్యాల: రాజీవ్‌నగర్‌లోని తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాల, మంచిర్యాలలో నూతనంగా కళాశాలలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులను స్వాగతిస్తూ ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ముత్యం బుచ్చన్న పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు తమలోని ప్రతిభను వెలికితీసుకుని, ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే TGMS మంచిర్యాల ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ, కళాశాల జీవితాన్ని ఆనందంగా మరియు స్ఫూర్తిదాయకంగా ప్రారంభించేందుకు ఈ వేడుకలు దోహదపడ్డాయని ప్రిన్సిపాల్ తెలిపారు. — ప్రిన్సిపాల్ తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాల రాజీవ్‌నగర్, మంచిర్యాల


