మండలం డోంగర్ గావ్ గ్రామంలో సర్పంచ్ అబ్దుల్ రెహమాన్ ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శి వేముల్వార్ వినోద్, ఆశ వర్కర్ దోమకొండ సునీత ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు.
డోంగర్ గావ్ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్ సూచించారు. నీటి నిల్వలు, మురుగునీటిపై అప్రమత్తతతో ఉండాలని వారు తెలిపారు.
దోమల నివారణ చర్యలు
ప్లాస్టిక్ డ్రమ్ములలో, నీటి తొట్టెలలో, బిందెలలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవద్దని, నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






