Palnadu/Gurazala (అక్షరవేకువ) జూలై 06
గతప్ుత్వహితహక్యక్పైయువత.ప్లాస్టిక్భూతాన్నినిర్మూలిద్దాందానిపైఅవగాహనకల్పిద్దాం.ెడీమీుెడీగఉన్నభీమంఅధికుుతవ్అసతృప్తివ్యక్తచేశు.కట్దిూపయుఖ్చుపెట్టినటినొక్క్10%కూడఅధికుుకపడేకపయనిఆపిచు.ఈనేపథ్య,'గ్న్డ్ైవ్ఫ్'పేుతప్త్యేకక్యక్ని్వహిచి,స్వచ్ఛదగొక్కునటడనికిసిద్ధగఉన్ననిఅధికుకువినతిపత్అదిచు.
గత ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి వేలాది మొక్కలు నాటినా, వాటిలో 10% కూడా అధికారులు కాపాడలేకపోయారని భీమారం యువత ఆరోపించారు. కేవలం ఫోటోలకు ఫోజులివ్వడానికే మొక్కలు నాటారని, వాటిని సంరక్షించే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కరెంటు వైర్లు, స్తంభాల పక్కన నాటిన మొక్కలు ఇప్పుడు మనుగడలో లేవన్నారు.
ఇదిలా ఉండగా, భీమారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతూ భీమారం యువత సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. రహదారి విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేయడంతో పర్యావరణం దెబ్బతిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు 'గ్రీన్ డ్రైవ్ ఫర్ భీమారం' పేరుతో ఒకరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తే, యువకులు, వ్యాపారులంతా కలిసి స్వచ్ఛందంగా మొక్కలు నాటుతామని వారు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో రామళ్ల రాజ్ కుమార్, మెండె మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.












