Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 19
హాజీపూర్ మండలంలో 108 వాహనం ఒక అద్భుతానికి వేదికైంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వాహనంలోనే విజయవంతంగా ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామానికి చెందిన లలిత (26) కు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించారు. మంచిర్యాల 108 సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి.
దీంతో ఈఎంటి సురేష్, వైద్యుల సూచనల మేరకు వాహనంలోనే ప్రసవం చేయగా, ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని మాతా శిశు ఆసుపత్రికి తరలించినట్టు పైలెట్ హరీష్ తెలిపారు.












