కుక్కలగూడూరు (అక్షరవేకువ) జూలై 12
కందులసంధ్యారాణి సంధ్యారాణిందుల జన్న పటేల్ చటబుల్ ట్స్ట్, ఆలయ ఫౌండేషన్ సంధ్యారాణియుకందుల్తం కందులందుల జన్న తృతీయ వ్ధంత సంధ్యారాణిద్భం కందులుకందుల్కందులలూడూు ్మంలో ఉచత కందులంట వైద్య శబన్న న్వహంచయ. ఈ కందుల్యకందుల్మంలో బీజేపీ OBC మోర్చారాష్ట్రఉపాధ్యక్షురాలుకందుల రాష్ట్ర ఉపాధ్యకందుల్షురాలు కందుల్చ ష్ట్ ఉపధ్యకందుల్షులు కందులందుల సంధ్యారాణిధ్యణ పల్ొన్ను.
కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆలయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, దివంగత కందుల రాజన్న గారి తృతీయ వర్ధంతిని పురస్కరించుకుని పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కందుల రాజన్న గారి కుమారుడు శ్రీ కందుల సాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, భారతీయ జనతా పార్టీ OBC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, దివంగత కందుల రాజన్న గారు సమాజ సేవనే జీవిత ధ్యేయంగా భావించి ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. వారి కుమారుడు శ్రీ కందుల సాగర్ తన తండ్రి జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని, యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
శిబిరంలో నిపుణులైన వైద్యులు వందలాది మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడంతో పాటు శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించి తదుపరి చికిత్సకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కుక్కలగూడూరు గ్రామ సర్పంచ్ మేడం బాపన్న- దేవక్క, వెన్నూర్ ఉపసర్పంచ్ పొన్నం సంతోష్ గౌడ్, పుట్నూరు సర్పంచ్ తోట ప్రశాంత్, ఆలయ ఫౌండేషన్ ట్రస్ట్ సీఈఓ రమేష్ బాబు, డిప్యూటీ సీఈవో నాగార్జున, ఆలయ ఫౌండేషన్ ఇంచార్జ్ పరికిపండ్ల రామ్, గోపు రామన్న, కొలిపాక శంకరయ్య, ఏరుకొండ తిరుపతి మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












