భీమారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సరళ పర్యవేక్షిస్తున్న 5వ అంగన్వాడీ లో మురిగిపోయిన గుడ్లు, లక్కపురుగులు పట్టిన పప్పు వంటి నాసిరకం ఆహారం అందిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితి ఒక అంగన్వాడీకే పరిమితమా లేక అన్ని అంగన్వాడీల్లోనూ ఇదే తీరుగా ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. అమాయక చిన్న పిల్లలను రోగాల బారిన పడేయడమే లక్ష్యమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు సంగతి ఎలా ఉన్నా, పిల్లల ఆరోగ్య పరిస్థితి మాత్రం నాశనమవుతోందని, అమాయక చిన్నారులకు ఇలాంటి ఆహారం పెడుతున్నారని మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా, రెండు అంగన్వాడీ సెంటర్లను ఒకేచోట నడుపుతున్నారని, మరోచోట ఉండాల్సిన ఆయాలు కానీ, టీచర్లు కానీ లేకపోవడం గమనార్హం.











