మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 08
తవమెదడకతసావంతోకోమాలోకవెళల70ఏళలవృదధడకహైదాబాదశోదశోదదవాాఅతశోదాధకచకతసశోదఎంఈఎంఈశోదఆసపతవైదశోదశోదలశోదశోదఅతశోదాధకదైచకతసకతసఅతశోదాధకందంచకతసపాణాలకాపాడా.శసతచకతసకతసలేకండాేఎంఈబోలైేపదధతదవాాఈఅతశోదాధకదభతవశోదశోదాసాధంచా.
తీవ్ర మెదడు రక్తస్రావంతో కోమాలోకి వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడికి అరుదైన వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ యశోద ఆసుపత్రి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ సాయి సతీష్ తెలిపారు.
బుధవారం పట్టణంలోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మందమర్రి మండలం గద్దెరాగడికి చెందిన కాసువార మల్లేష్ 2025 నవంబర్లో తీవ్ర తలనొప్పితో కుప్పకూలారని చెప్పారు. మంచిర్యాలలోని మెడిలైఫ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా, మొదట మెదడులో రక్తస్రావాన్ని నియంత్రించేందుకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాపాయస్థితి నుండి రక్షించగలిగామని తెలిపారు.
అనంతరం 2026 జనవరిలో మళ్లీ సమస్య తలెత్తడంతో శస్త్రచికిత్స చేయకుండా తొడలోని రక్తనాళం ద్వారా మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ఆధునిక చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆరు నెలలుగా మల్లేష్ ఆరోగ్యంగా ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడిలైఫ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కౌటం కుమారస్వామి, యశోద ఆసుపత్రి మేనేజర్ అంకం మల్లేష్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.












