మంచిర్యాల సిటీ, Mancherial, Telangana (అక్షరవేకువ) సెప్టెంబర్ 28
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పేదల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వపరంగా లక్కీ డ్రా ప్రక్రియ పూర్తి కావడంలో ఆలస్యం కావడంతో, ఇళ్లలోకి ఎప్పుడు వెళ్తామన్న ఆశ నెలకొని ఉంది. గత మూడేళ్లుగా ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందా అని జాబితాలో ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పేదల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వపరంగా లక్కీ డ్రా ప్రక్రియ పూర్తి కావడంలో ఆలస్యం కావడంతో, ఇళ్లలోకి ఎప్పుడు వెళ్తామన్న ఆశ నెలకొని ఉంది. గత మూడేళ్లుగా ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందా అని జాబితాలో ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అధికారులు ఈ ప్రక్రియకు తెర లేపారు. మొత్తం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను, డివిజన్ కు 12 మంది చొప్పున అర్హత కలిగిన పేదవారిని సేకరించాలన్న ఎమ్మెల్యే సూచన మేరకు ప్రతి డివిజన్ నుండి 12 మంది దరఖాస్తులను అధికారులకు అందించారు. మొత్తం 720 మంది దరఖాస్తుదారుల నుండి 344 మందిని ఎంపిక చేయడానికి లక్కీ డ్రా కొనసాగింది. అయితే, పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం 330 మాత్రమే ఉన్నాయి.
పాత జాబితాలోని 335 మందిలో 268 మంది అర్హులను గుర్తించి, 68 మందిని తొలగించారు. కొత్తగా ఎంపికైన 344 మందితో పాటు పాత జాబితాలోని 268 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందాల్సి ఉంది. మొత్తం 612 మంది లబ్ధిదారులు ఎప్పుడు ఇళ్లలోకి చేరి తమ కల నెరవేర్చుకుంటామని ఎదురు చూస్తున్నారు. గతంలో ఎంపికైన వారితో పాటు కొత్తవారు సైతం మంచిర్యాలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తుంది. త్వరలో తమకు ఇళ్లను అందుబాటులోకి తేవాలని ఎంపికదారులు కోరుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో అర్హులైన వారికి త్వరలోనే ఇళ్ల కేటాయింపు జరుగుతుందని, ప్రక్రియ పూర్తి అయిన తర్వాత జాబితా విడుదల చేస్తామని మంచిర్యాల తహసిల్దార్ రపాతుల్లా హుస్సేన్ తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం 330 ఇళ్లు సంపూర్ణంగా తయారీలో ఉన్నాయని, మిగతావి అందుబాటులోకి వస్తాయని కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ చెప్పారు. ఒక బ్లాక్లో 72 ఇళ్లు కోర్టు కేసులో ఉన్నాయని, వాటి పరిష్కారం తర్వాత అందిస్తామని, ప్రభుత్వ నుంచి దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు.

