యెల్లక్కపేట్ (అక్షరవేకువ) నవంబర్ 15
యెల్లక్కపేట్: శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన నవోదయ మాక్ టెస్ట్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ పరీక్షకు సుమారు 100 మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేయడం, వారి మానసిక సామర్థ్యం, గణిత పరిజ్ఞానం, ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మాక్ టెస్ట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి నవోదయ విద్యాలయంలో సీట్లు సాధించాలని అతిథులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మేడ శ్రవణ్ రెడ్డి, నాగుల మహేష్, అనూష, లావణ్య, రాకేష్, సతీష్, ఆర్బిట్ స్కూల్ కరస్పాండెంట్ అశోక్, వివేకానంద విద్యామందిర్ ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, మధుకర్, లోయోలా స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఇలాంటి విద్యా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.


