దండేపల్లి, 26 September
మండలం మేదరిపేట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొలంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.
మండలం మేదరిపేట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొలంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.
రజక సంఘం డిమాండ్లు
ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు మందపల్లి వెంకటేష్ మాట్లాడుతూ, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రజకుడికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బట్టలు ఉతికే పనిని రజకులకే అప్పగించాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
అలాగే వృత్తి విద్యా కోర్సుల్లో చేరే రజక విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లించాలని, ప్రతి గ్రామంలో దోబీ ఘాట్లను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.