పులిమడుగు, సిటీ, మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 30
మచయా భవ వైదయ కషయ, ద వ మా వక వచచాయసమాచారం. కా చేచకచకకవడంవడ, కమాడ వీచై మా 2 కమీట ఎస్ ఆర్మమయే ఇట వక క వళా వచచదసమాచారం. ఈ ఘట థాకా కక ేదసమాచారం.
మంచిర్యాలలోని పెద్ద ఆసుపత్రిలో వైద్య సేవలు కు జబ్బు చేసినట్లు అనిపిస్తున్నాయి. రోగులకు వైద్యం అందించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా, అలసత్వంగా వ్యవహరించడం రోగుల పాలిట శాపంగా మారుతోంది. మంగళవారం రాత్రి పులిమడుగుకు చెందిన బుఖ్య బుజ్జి (55)ని కుమారుడు బుక్య రాజ్ కుమార్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్య సిబ్బంది పట్టింపు లేకుండా వ్యవహరించడంతో, రాజ్‌కుమార్ తన తల్లిని వీల్‌చైర్‌లో సుమారు 2 కిలోమీటర్ల దూరం ఎమ్మెల్యే ఇంటి వరకు తోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన సిటీలో దావానంలా వ్యాపించింది. వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, రోగి పరిస్థితిని సిబ్బంది ఫోన్ ద్వారా ఎమ్మెల్యే పి ఎస్ ఆర్ కు వివరించారు. అనంతరం ఆర్ఎంఓ శ్రీధర్ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకుని, బుఖ్య బుజ్జిని ఆసుపత్రిలో చేర్చుకుంటామని, అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అన్న వాక్యం మంచిర్యాల ఆసుపత్రికి సరిగ్గా సరిపోతుందని పలువురు పేర్కొంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం రోగుల పాలిట ఇబ్బందిగా మారుతున్నాయని, ఈ పరిస్థితిని మార్చేలా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.












