పెద్దపల్లి, 2026-11-23
గోదావరిఖనిలోని అమృత రాజ్ ఫంక్షన్ హాల్లో స్నేహ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం బాలల కళోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది చిన్నారులు పాల్గొని తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. నాగరాజు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
క్లాసికల్, వెస్ట్రన్, ఫోక్ వంటి వివిధ నృత్య రీతుల్లో చిన్నారులు ప్రదర్శించిన అద్భుతమైన నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రతిభను చూసి ప్రేక్షకులు అభినందించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి బాలలను మొబైల్ ఫోన్లు, టీవీలకు బానిసలుగా కాకుండా సాంస్కృతిక, క్రీడా రంగాల వైపు ప్రోత్సహించాలని సూచించారు.
చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ పిల్లలు రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చిన్నతనం నుంచే వారిలోని ప్రతిభను వెలికితీయడానికి తగిన శిక్షణ అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ తడగొండ నరసయ్య, వీరబోయిన శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులతో పాటు డ్యాన్స్ మాస్టర్లు సర్వేష్, కుమార్, నగేష్, జ్యోతిర్మయి, శ్రీ విష్ణు, రవికుమార్, రేవతి, స్వాతి శ్రీ, శ్రావణి, విజయ్ , దేవా, సురేష్, విద్యాసాగర్, ప్రశాంత్, సునీల్, అర్చన, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.






