పెద్దపల్లి, 2026-11-26
మంథనిలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల శిలాఫలకంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరు లేకపోవడంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు లేఖ రాశారు.

ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకంపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి, ఇతర అర్హులైన ప్రజాప్రతినిధులు, అధికారుల పేర్లు లేకపోవడం ప్రభుత్వ ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఇది కేవలం పేర్లకు సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర అత్యున్నత ప్రజాస్వామ్య కార్యనిర్వాహక పదవి గౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.
ప్రస్తుత శిలాఫలకాన్ని 24 గంటల్లోగా మార్చి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేర్లతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. శిలాఫలకానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై విచారణ జరిపి, తప్పిదం నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరిచేసిన శిలాఫలకం ఫోటోలతో పాటు చర్యల నివేదికను అందించాలని లేఖలో పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థల గౌరవాన్ని కాపాడాలని, అధికార యంత్రాంగం వ్యక్తులకు కాకుండా రాజ్యాంగానికి విధేయంగా పనిచేయాలని వంశీకృష్ణ స్పష్టం చేశారు.