మంచిర్యాల, తెలంగాణ (అక్షరవేకువ) నవంబర్ 18
స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రతి ఇంటికీ చేరవేయాలని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల కుటుంబ పెద్దకు రూ.5 లక్షల బీమా భరోసా కల్పించడం గొప్ప కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్‌ల నాయకత్వంలో ఈ పథకాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి అర్హ కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రఘునాథ్ రెడ్డి కోరారు.


