క్రాస్ (అక్షరవేకువ) అక్టోబర్ 02
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా, అమ్మానాన్న యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎర్రం శెట్టి సంతోష్ 60వ సారి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ అధికారులు ఆయనను ఘనంగా సత్కరించారు.
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా, స్వచ్ఛంద సేవా సంస్థ అయిన అమ్మానాన్న యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎర్రం శెట్టి సంతోష్ తన అమూల్యమైన రక్తాన్ని 60వ సారి స్వచ్ఛందంగా దానం చేశారు. ఈ సందర్భంగా, రెడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు రక్త నిధి కేంద్ర ఇంచార్జి వి. మధుసూదన్ రెడ్డి తన కార్యాలయంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, రెడ్ ప్రశంసా పత్రంతో పాటు మొమెంటోను అందజేశారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఎర్రం శెట్టి సంతోష్ రక్తదానం చేయడం ఒక నిబద్ధత అని, గతంలో ఆయన పేరును రాష్ట్ర గవర్నర్ అవార్డుకు ప్రతిపాదించడం కూడా జరిగిందని తెలిపారు. తన సంస్థ ద్వారా రక్తదాన శిబిరాల నిర్వహణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు.












