అసెంబ్లీలో బీసీ తీర్మానంపై ఓబీసీ కాలపరిమితిని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంగళవారం బీజేపీ దిష్టిబొమ్మను దహనండాక్టర్నీలకంఠ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీ నేతలను ఖండించారు.
చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ తీర్మానం ఆమోదమయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. కాలయాపనతో తీర్మానం ప్రెసిడెంట్ వద్దనే ఉందని, వెంటనే పార్లమెంటులో ఆమోదం అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తేనే బీసీలకు నమ్మకం కలుగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్నీలకంఠ నీలకంఠలకంఠేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. తమ హక్కుల రక్షణకు భంగం వాటిల్లితే ఉద్యమాలు, ఆందోళనలే శరణ్యమని, బీసీ తీర్మానం, బీసీ హక్కులు నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు జైపూర్ శ్రీనివాస్ గౌడ్, రవిల, అరిగెల పద్మ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.












