జిల్లా కేంద్రంలోని హమాలివాడలో ఉన్న గణేష్ మండపాన్ని సోమవారం రాత్రి ఏసీపీ ప్రకాష్ సందర్శించారు. నవరాత్రుల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, జూదం, మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలను నివారించడంపై ఆయన సూచనలు చేశారు.
ఏసీపీ ప్రకాష్ మండపాన్ని పరిశీలించి, యూత్ సభ్యులకు సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించారు. జూదం, మద్యం సేవించేవారిని మండపం వద్దకు రానివ్వద్దని, భక్తిశ్రద్ధలతో నిమజ్జనం వరకు నవరాత్రులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్తు వాడకం, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్‌ను మండలి సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్ శర్మ 55వ డివిజన్ కార్పొరేటర్ గాండ్ల సత్తెమ్మ, ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి, శ్రీ భక్తాంజనేయ సాయి గణేష్ మండలి, వానరసేన యూత్ కమిటీ సభ్యులు పంచాల నవీన్, బద్రి మనోజ్, బోజ్జ క్రాంతి, తోగరి శ్రీకాంత్, తోగరి రాజేష్, బోజ్జ శ్రావణ్ పాల్గొన్నారు.










