హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈనెల 17వ తేదీన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రచార జాతరలో రామడుగు లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. ఈ సభకు ప్రజలందరూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రేగుంట చంద్రశేఖర్, దేవి పోచన్న, సత్యనారాయణ, రొంటాల శ్యామ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వారు కూడా సభ ప్రాముఖ్యతను వివరించి, ప్రజలను అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.












