ఆదిలాబాద్ జిల్లా మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దిన ప్రాముఖ్యతను వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని తెలియజేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడసం దవలత్ రావు, మోహితే మారుతీ, అంకతి రవి, వాగ్మారె విశ్వంబర్, సొంటక్కే బాలాజీ, మాధవ్ మస్కె, గణపతి, జ్ఞనోభా, గణేష్ గౌడ్, రాథోడ్ రమేష్, శ్రీకర్ మహారాజ్, సెడామాకే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.












