ఆవిష్కరణలకు రూపమిస్తూ అభివృద్ధికి బాటలు వేయడంలో ఇంజనీర్ల పాత్ర కీలకమని, దేశ అభివృద్ధికి ఇంజనీర్లే మూలస్తంభాలని ముఖ్య అతిథులు లయన్ పి.రాములుగౌడ్, జి.వెంకన్న అన్నారు. భారతరత్న, స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని పురస్కరించుకుని, లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ అధ్యక్షుడు లయన్ శంకరి విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
లయన్ ఇంజనీర్ బి.దిలీప్ కుమార్ దాతృత్వంతో, సెప్టెంబర్ బుధవారం రాత్రి సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో నాయికోటి రామప్ప గృహంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ రంగంలో విశేష కృషి చేస్తున్న వివిధ విభాగాలకు చెందిన 11 మంది ఇంజనీర్లను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు ఎంతో కీలకమని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దేశ ప్రగతికి ఇంజనీర్లు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను స్ఫూర్తిగా తీసుకుని, యువ ఇంజనీర్లు దేశ నిర్మాణంలో మరింతగా భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ అధ్యక్షుడు లయన్ శంకరి విజయేందర్ రెడ్డి, లయన్ ఇంజనీర్ బి.దిలీప్ కుమార్, సంఘ బాధ్యులు ఎస్.విజయేందర్ రెడ్డి, పి.రాములుగౌడ్, అనంతరావు కులకర్ణి, రీజియన్ చైర్మన్ జి.వెంకన్న, కో-చైర్మన్ ఎస్. శరత్ చంద్రారెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఎన్. రామప్ప, రీజియన్ కార్యదర్శి ఎం.వెంకటేశం, సి.హెచ్. రజనీకాంత్, పి.రాంగోపాల్, పి.రామకృష్ణారెడ్డి, జి.మాణిక్ రావు, ఎస్.వెంకటేశ్వర్ రావు, టి.అల్లంరెడ్డి, పి.బస్వరాజ్, ఏ. లక్ష్మారెడ్డి, డి.రామచంద్రం, లయన్ శ్రీనివాస్ గౌడ్, నాయికోటి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










