ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజలు తమకు కల్పించిన హక్కులను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ వడాల రాములు సూచించారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, ప్రజా నిధుల వినియోగం, పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని చట్టబద్ధంగా తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని అన్నారు. సమాచార హక్కు చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచేందుకు నిర్వహించే సదస్సులు ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంలో ఆర్టీఐ చట్టం ప్రాధాన్యతను వివరించారు.
హైదరాబాదులోని రవీంద్ర భారతిలో న నిర్వహించనున్న ఆర్టీఐ సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవ అవగాహనా సదస్సుకు సంబంధించిన పోస్టర్ను అదనపు కలెక్టర్ వడాల రాములు ఆవిష్కరించారు. జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూరస్రవంతి ఆదేశాల మేరకు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
రవీంద్ర భారతిలో నిర్వహించే అవగాహనా సదస్సులో సమాచార హక్కు చట్టం వినియోగ విధానం, ప్రజలకు అందుబాటులో ఉన్న హక్కులు, సమాచారాన్ని పొందే ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్, జాతీయ సహాయ కార్యదర్శులు వంగల వివేకానంద, మార్క నవీన్, తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ గడప కృష్ణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దూడం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లపురాజు ప్రకాష్ పటేల్, మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పురెళ్ల శ్రీనివాస్, జిల్లా కో-కన్వీనర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ పార్వతి అజయ్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ దూలం నాగలక్ష్మి, మందమర్రి మండల అధ్యక్షుడు అలిశెట్టి నరసయ్య పటేల్, తాండూర్ మండల అధ్యక్షుడు చింతల సంతోష్, తాండూర్ మండల డిప్యూటీ ప్రెసిడెంట్ తోగరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


