ప్రపంచ చెవిటితన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయ అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య దివ్యాంగుల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు.
ప్రపంచ చెవిటితన దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య హాజరయ్యారు. దివ్యాంగుల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, ఉచిత న్యాయ సహాయం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆమె అవగాహన కల్పించారు. దివ్యాంగులు, ముఖ్యంగా వినికిడి లోపం ఉన్న పిల్లలు తమ హక్కులను తెలుసుకొని, అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని ఆమె తెలిపారు. సమాజంలో దివ్యాంగుల పట్ల సమానత్వం, గౌరవం మరియు సహానుభూతి కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఆర్.ఎం.ఓ. రవి కుమార్, ఈఎన్టీ విభాగాధిపతి, ఇతర వైద్యులు, సిబ్బంది, వినికిడి లోపం ఉన్న చిన్నారులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.











