ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల సేవలకు గుర్తుగా చెన్నూరు పట్టణంలో సేవలో నా భాగస్వామ్యం కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరదాచార్యుల విగ్రహం వద్ద శుభ్రతా కార్యక్రమం చేపట్టి, క్షీరాభిషేకం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అందించిన సేవలకు గుర్తుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా, చెన్నూరు పట్టణంలో సేవలో నా భాగస్వామ్యం కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, అభినవ పోతన బిరుదాంకితులైన వరదాచార్యుల విగ్రహం వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి, విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త ఏదో ఒక సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఈ సేవా సంకల్పాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఏతం శివకృష్ణ, గర్రెపల్లి శాంతా వెంకట నరసయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత వెంకటేష్, పట్టణ నాయకులు ఆడప శ్రీనివాస్, ప్రసాద్, తగరం మధురాజ్, చటారి వెంకటేష్, చా శ్యాం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.











