సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ మహమ్మద్ జావిద్ అలీ, టీఎన్జీవోస్ కార్యదర్శి వేల్పూరు రవి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సంఘం అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసేలా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ సంఘం అధ్యక్షులుగా యాదవరెడ్డి, కార్యదర్శిగా వెంకటేష్, అసోసియేట్ అధ్యక్షుడిగా రమేష్, కోశాధికారిగా హైమద్ ఖాన్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రాజు, సుజాత, నాగమణి, ప్రదీప్, జాయింట్ సెక్రటరీలుగా గోపాల్, పర్వీన్ బేగం, అజాం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రావణి ఎన్నికయ్యారు. సంఘం సభ్యులుగా వసీమ, హైమద్, కిరణ్, యాదయ్య, లావణ్య, లతా, పజిల్ హైమద్, అజయ్, మునవర్, ఇమ్రాన్ ఖాన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలు, సంఘటిత శక్తిని మరింత బలోపేతం చేయడం నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యాలని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల ఐక్యత, పరస్పర సహకారం, సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, కృష్ణ, సుధామణి నాగేశ్వరరావు, మల్లికార్జున్, రషీద్, షరీఫ్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.











