జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పులిమామిడి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
అనంతరం, తెలంగాణ వీరయోధుడు, దివంగత పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకలుగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఈ నెల 22న నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై పులిమామిడి రాజు జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. జయంతి వేడుకలను ఘనంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు సభా వేదిక ఏర్పాటు, పూలమాలలతో నివాళులర్పించడం, వేదిక అలంకరణ, ప్రచార కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందించాలని కలెక్టర్‌ను పులిమామిడి రాజు కోరారు.
తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పులిమామిడి రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జనార్ధన్‌తో పాటు పిట్టల రమేష్, మామిళ్ల ఆనంద్, రాజేష్, బుస్స సాయి, బస్వరాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.











